Ante Sundaraniki: బ్లాక్ బస్టర్ తీశాం.. ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం.. న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

సాధారణంగా అత్తగారింటికి అల్లుడు వస్తే విందు భోజనాలు పెడతారు.. కానీ ఇక్కడ జూన్ 10కి అల్లుడే మీకు విందు భోజనం పెట్టబోతున్నాం..

Ante Sundaraniki: బ్లాక్ బస్టర్ తీశాం.. ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం.. న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2022 | 9:02 AM

న్యాచురల్ స్టార్ నాని.. మలయాళ కుట్టి నజ్రియా నజీమ్ జంటగా నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా నజ్రియా తెలుగు చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం అంటే సుందరానికీ ట్రైలర్ ను వైజాగ్ వేదికగా ఆవిష్కరించారు. సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‏లో న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సాధారణంగా అత్తగారింటికి అల్లుడు వస్తే విందు భోజనాలు పెడతారు.. కానీ ఇక్కడ జూన్ 10కి అల్లుడే మీకు విందు భోజనం పెట్టబోతున్నాం.. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులే బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు.. కానీ ఇక్కడ మేమే బ్లాక్ బస్టర్ తీశాం.. ఇక అది ఎక్కడికి తీసుకువెళతారో మీ ఇష్టం.. జూన్ 10 అంటే.. సుందరానికీ సినిమా మీది.. వందశాతం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. ఇట్స్ మై ప్రామీస్. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు.. లీలా క్యారెక్టర్ లో నజ్రియాను తప్పా మరెవరిని ఊహించుకోలేరు.. ఈ సినిమా చూసేందుకు మీతోపాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నారు. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి