Gold & Silver Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 51,930కు చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం
పసిడి కొనాలనుకుంటున్నవారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. జూన్ 3న ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 100 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,600కు చేరింది. అలాగే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 51,930కు చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. హైదరాబాద్ సహా.. చెన్నై, ఢిల్లీ, ముంబైలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు.. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేట్ రూ. 52,100కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600 కాగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,930కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,600.. 10 గ్రాముల 24 క్యారెట్ల 51,930కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 51,930కు చేరింది. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 51,930కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,600 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,930కు చేరింది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతుంది. నిన్న తగ్గిన వెండి ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 61,400కు చేరింది. అలాగే హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేట్ రూ.67,000కు చేరింది. అలాగే ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 61,400 కాగా.. బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం, కేరళలో కిలో వెండి ధర రూ. 67000కు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ.61,400 కాగా.. చెన్నైలో రూ. 67000కు చేరింది.