Viral Photo: ఇతను సూపర్ యాక్టర్.. అంతకుమించి టాలెండ్ ఉన్న రైటర్.. ఎవరో గుర్తించారా..?
టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓ యంగ్ హీరో చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు అతడిని గుర్తించలేకపోతున్నారు. మీరు కనిపెట్టారా..?
Tollywood Hero: దక్షిణాదిలో సినిమా స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు. ఎన్టీఆర్(Senior NTR), ఎమ్.జీ.ఆర్, రజనీకాంత్, చిరంజీవి(Chiranjeevi), అజిత్, విజయ్(hero Vijay) వంటి కొందరు స్టార్స్‌ను అయితే ఆరాధిస్తారు కూడా. ఫిల్మ్ స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా సౌత్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. సినిమా సెలబ్రిటీలు… ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ మూవీ అప్‌డేట్స్‌తో పాటు.. అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. అవి క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరో చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతోంది. అందులోని వ్యక్తిని మీరు కనిపెట్టారా..? చాలా కష్టం మేమే చెప్పేస్తాం లెండి. సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్.. అడవి శేష్. అతను మంచి పెన్ పవర్ ఉన్న రైటర్ కూడా. విభిన్నమైన కథలతో అతడు సెపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు. తన “కర్మ” , “కిస్” చిత్రాల దర్శకత్వం వహించాడు శేష్. కెరీర్ తొలినాళ్లతో సపోర్టింగ్ రోల్స్ చేసిన శేష్.. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు.
26/11 ముంబై దాడుల్లో అమరుడైన NSG మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘మేజర్’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందకు వచ్చాడు శేష్. ఈ సినిమాకు ప్రజంట్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇలాంటి రియల్ హీరో జీవిత కథను ఎంచుకున్నందుకు శేష్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా ‘హిట్’ కేస్ 2లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ 37 ఏళ్ల హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తనకు పెళ్లిపై గాలి మళ్లిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా శేష్ పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది మాత్రం అమెరికాలోని బర్క్ లీలో. అక్కడే స్టడీస్ కూడా కంప్లీట్ చేశాడు. కాగా శేష్ చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టీవీఎస్ మోపెడ్‌పై స్టైల్‌గా ఫోటోకు స్టిల్ ఇచ్చాడు లిటిల్ శేష్. ఈ ఫోటో చూసి చిన్నప్పుడే శేష్‌లో హీరో క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..