Akshay Kumar: నార్త్, సౌత్ అనే తేడా లేదు.. భవిష్యత్తులో అల్లు అర్జున్‏తో సినిమా చేస్తానేమో.. అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్..

హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషలలో విడుదలై సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలకు ఫిదా అయ్యారు.

Akshay Kumar: నార్త్, సౌత్ అనే తేడా లేదు.. భవిష్యత్తులో అల్లు అర్జున్‏తో సినిమా చేస్తానేమో.. అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్..
Akshay Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2022 | 9:30 AM

ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషలలో విడుదలై సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలకు ఫిదా అయ్యారు. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలకు విశేషమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే గతంలో దక్షిణాది సినిమాలపై ఉన్న బీటౌన్‏లో చిన్నచూపు ఉండగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సౌత్ సినిమాల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి చిత్రాలు రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది హీరోలతో సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

డైరెక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం పృథ్వీరాజ్. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన అక్షయ్.. సౌత్ సినిమా క్రేజ్ గురించి స్పందించాడు.. ఇండస్ట్రీలో సౌత్, నార్త్ అనే తేడా లేదని.. మనదంతా భారతీయ సినీ పరిశ్రమ అన్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక్కటే అని.. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల నటులు కలిసి పనిచేసే సమయం వచ్చిందన్నారు. అలాగే తాను కూడా భవిష్యత్తులో అల్లు అర్జున్ తో నటించాల్సి రావచ్చేమో అని.. లేదా మరో సౌత్ హీరోతో కలిసి నటించే అవకాశం ఉందేమో అంటూ చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడంతో వీరిద్ధరి కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందా ?అందుకే అక్షయ్ హింట్ ఇచ్చాడా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనప్పటికీ అక్షయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?