AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasanamaha: గిన్నిస్ రికార్డ్‏కెక్కిన ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్.. మనసా నమహ టీంకు సెలబ్రెటీల విషెష్..

ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో ప్రదర్శించారు.. ఇప్పటివరకు 513 అవార్డులను సొంతం చేసుకుంది.

Manasanamaha: గిన్నిస్ రికార్డ్‏కెక్కిన ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్.. మనసా నమహ టీంకు సెలబ్రెటీల విషెష్..
Manasa Namaha
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 3:33 PM

Share

ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న మనసా నమహా షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.. దీపక్ రెడ్డి అనే యువకుడు తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ గిన్నిస్ రికార్డులోకి వెళ్లింది.. మొట్ట మొదటిసారి గిన్నిస్ రికార్డ్ కెక్కిన తెలుగు లఘు చిత్రంగా మనసా నమహా నిలిచింది.. ఇందులో విరాజ్, అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ ప్రధాన పాత్రలలో నటించారు.. చాలా గర్వంగా ఉంది.. ఒక ఫైటర్, అచీవర్‏గా ఎలాంటి మేజర్ సపోర్ట్ లేకుండా దీపక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ప్రపంచంలో ఏ చిత్రానికి రానన్ని అవార్డ్స్ ఈ వచ్చాయి.. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దర్శకులు జరుపుకోవాల్సిన వేడుక.. ఎన్నో కలలు, ఆకాంక్షలతో నిండిన ఓ యువకుడు సాధించిన గొప్ప విజయం ఇది. రాబోయే తరాల యువ దర్శకులకు అతడే స్పూర్తి అంటూ చిత్రనిర్మాత తన ఇన్ స్టాలో షేర్ చేశారు.

ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో ప్రదర్శించారు.. ఇప్పటివరకు 513 అవార్డులను సొంతం చేసుకుంది. అంత పెద్ద మొత్తంలో అవార్డులు గెలుచుకున్న తొలి షార్ట్ ఫిల్మ్ గా ఈ సినిమా నిలిచింది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సిబ్బంది సర్టిఫికెట్ అందించారు. ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఉత్తమ షార్ట్ ఫిల్మ్ టైటిల్‌ను అందుకుంది. మేజర్ సినిమా డైరెక్టర్, హీరో అడివి శేషు, డైరెక్టర్ సుకుమార్ సోషల్ మీడియా వేదికంగా ఈ చిత్రయూనిట్ ను అభినందించారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?