Nikhil Siddartha: సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఏడు రంగుల వాన’.. రిలీజ్ ఎప్పుడంటే..
ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, "నన్నయ్య రాసిన" అలానే "టైం ఇవ్వు పిల్ల" అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో "18పేజిస్" చిత్రం కోసం సిద్ శ్రీరామ్ తో తదుపరి పాటను పాడించనుంది చిత్ర బృందం.
ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్”. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో “18పేజిస్” చిత్రం కోసం సిద్ శ్రీరామ్ తో తదుపరి పాటను పాడించనుంది చిత్ర బృందం.
ఈ మూవీ కోసం శ్రీమణి రాసిన “ఏడు రంగుల వాన” అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇదివరకే రిలీజైన రెండుపాటలకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ “ఏడురంగుల వాన” పాటకు కూడా అదే స్థాయిలో శ్రీమణి లిరిక్స్ అందించారు. సిద్ శ్రీరామ్ ఇప్పుడు తెలుగు సినిమాలలో ఒక సంగీతం సంచలనం అన్న సంగతి తెలిసిందే. తను ఏ పాట పాడిన అది ట్రెండింగ్ అవుతుంది, యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ దాటుతుంది. తన పాటలు అన్ని ఇప్పుడు ఉన్న యూత్ కి ఒక స్లో పాయిజన్ లా ఎక్కుతాయి.
ఇదివరకే గోపి సుందర్ మ్యూజిక్ చేసిన “గీత గోవిందం” లో “ఇంకేమి ఇంకేమి కావలె” అనే పాటను పాడి ఒక సంచలనం సృష్టించాడు సిద్. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న “18 పేజిస్” కోసం మరోసారి గోపి సుందర్ మ్యూజిక్ లో “ఏడు రంగుల వాన” అనే పాటను పాడాడు. ఈ పూర్తి పాట డిశంబర్ 11న విడుదల కానుంది.
My Favourite Lyrics and meaning wise #YedurangulaVaana song from #18Pages ?
Full song out on Dec 11th!
A @GopiSundarOffl Musical ?@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @sidsriram @ShreeLyricist @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/oqUq9JjH2M
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.