Year Ender 2024: ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలివే.. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మూవీస్ ఇవిగో
2024 ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో 2025 రానుంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది సినీ పరిశ్రమకు ఆశాజనకంగా సాగిందని చెప్పుకోవచ్చు. దక్షిణాది సినిమాలు అందులోనూ తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచ వ్యాప్తంగా గట్టిగా వినిపించింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పుష్ప 2 సినిమా గురించే
2022, 23తో పోలిస్తే 2024లో బ్లాక్ బస్టర్ సినిమాల సంఖ్య తక్కువగా ఉంది. ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. అయితే పుష్ప 2, కల్కి సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేశాయి. మరికొన్ని సినిమాలు 300-400 కోట్లతో సరిపెట్టుకున్నాయి. అలా 2024లో 500 కోట్లు, అంతకంటే ఎక్కువ వసూలు చేసిన సినిమాలేంటో తెలుసుకుందాం రండి.
పుష్ప 2
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. విడుదలైన 14 రోజుల తర్వాత ‘పుష్ప 2’ చిత్రం 1400 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ‘పుష్ప 2’ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥
Book your tickets now! 🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4
— Pushpa (@PushpaMovie) December 16, 2024
కల్కి 2898 AD
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా కు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం ‘కల్కి 2898 AD’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.
‘స్త్రీ 2
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరిచిన చిత్రం ‘స్త్రీ 2’. ఈ ఏడాది రూ.500 కోట్లు దాటిన ఏకైక హిందీ చిత్రం కూడా ఇదే. ఖాన్స్, రణబీర్, రణవీర్ లాంటి స్టార్స్ లేకుండా, ‘స్ట్రీ 2’ బాక్సాఫీస్ వద్ద 850 కోట్ల రూపాయలను రాబట్టింది. రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.
దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా చోట్ల నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం విశేషం.
విజయ్ ది గోట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ది గోట్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇందులో విజయ్ ద్వి పాత్రాభినయం చేయడం విశేషం. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. త్రిష ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.