AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie : సలార్ పై యశ్ కామెంట్స్.. సినిమా హైప్‌ను పెంచేసిన రాకీ బాయ్

కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 1, 2 సినిమాలో ఒకదానితో ఒకటి పోటీపడి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలు అన్ని భాషల్లో భారీ విజయం అందుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Salaar Movie : సలార్ పై యశ్ కామెంట్స్.. సినిమా హైప్‌ను పెంచేసిన రాకీ బాయ్
Salaar
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2023 | 11:24 AM

Share

ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఏది అంటే టక్కున చెప్పే పేరు సలార్ అంతగా ఎదురుచేసుతున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ హైప్ ఉంటుంది. పైగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 1, 2 సినిమాలో ఒకదానితో ఒకటి పోటీపడి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలు అన్ని భాషల్లో భారీ విజయం అందుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎట్టకేలకు సలార్ సినిమానుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.

సలార్ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1 న విడుదల చేయనున్నారు. అలాగే సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి మొన్నామధ్య వచ్చిన గ్లింప్స్ వరకు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. సలార్ సినిమాలు గతంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉంటుందని టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది. చిత్రయూనిట్ కూడా ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా హైప్ ను బాగా పెంచేస్తుంది.

ఈ క్రమంలో సలార్ సినిమా గురించి గతంలో యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ లో యశ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన దాంట్లో కేజీఎఫ్ అనేది చాలా చిన్న భాగం మాత్రమే అంతకు మించినది ప్రశాంత్ దగ్గర ఉంది అని అన్నాడు. దానికి ప్రశాంత్ కూడా నిజమే అని ఒప్పుకున్నాడు. దాంతో యశ్ అప్పుడు చెప్పింది సలార్ సినిమా గురించే అని అంటున్నారు అభిమానులు. కేజీఎఫ్ సినిమాను మించి సలార్ సినిమా ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు యశ్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవ్వడంతో అభిమానుల్లో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని దాటిపోతున్నాయి. సలార్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.