Family Star : “సంక్రాంతికే రావాలా ఏంటి..?” రేస్ నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్..!
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ అభిమానులు దారుణంగా నిరాశపడ్డారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో పూరిజగన్నాథ్ , ఛార్మి, విజయ్ కాన్ఫిడెన్స్ చూసి పక్క సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. రికార్డ్స్ తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

విజయ్ దేవర కొండ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. అప్పుడెప్పుడో వచ్చిన అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్స్ అందుకోలేకపోయారు విజయ్. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ అభిమానులు దారుణంగా నిరాశపడ్డారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో పూరిజగన్నాథ్ , ఛార్మి, విజయ్ కాన్ఫిడెన్స్ చూసి పక్కా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.. రికార్డ్స్ తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దాంతో విజయ్ సైలెంట్ అయ్యాడు కూల్ గా తన నెక్స్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఖుషి. ఈ సినిమా పర్లేదు అనిపించుకున్నా ఫ్యాన్స్ కు అది సరిపోలేదు.
ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గతంలో విజయ్, పరశురామ్ కలిసి గీతగోవిందం సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమానుంచి ఇటీవలే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో విజయ్ చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. “ఐరెనే వంచాలా ఏంటి.? “అనే డైలాగ్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పర్సన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే దీపావళి సందర్భంగా ఓ ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం లాంటి బడా సినిమా కూడా సంక్రాంతికి రానుంది. దాంతో ఈ పోటీ నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.
View this post on Instagram
విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



