AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: ఘాటు పెంచేసిన గుంటూరుకారం.. మహేష్ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, కాలేజీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గుంటూరు కారం అనే మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ ఇద్దరు. గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నాడు.

Guntur Kaaram: ఘాటు పెంచేసిన గుంటూరుకారం.. మహేష్ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్
Gunturu Kaaram
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2023 | 11:55 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, కాలేజీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గుంటూరు కారం అనే మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ ఇద్దరు. గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నాడు. గుంటూరు కారం సినిమాలో మహేష్ కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

రీసెంట్ జీ గుంటూరు కారం సినిమానుంచి దమ్ మసాలా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈసాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సినిమా పై అంచనాలు పెంచేసింది ఈ సాంగ్. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న గుంటూరు కారం సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెకండ్ సాంగ్ గా ఓ మెలోడీని రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే దీని పై ఓ అప్డేట్ ఇవ్వనున్నారట. అలాగే ఇంకో నాలుగు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందట. ఈసాంగ్ షూట్ తో గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ మధ్యలో ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. త్వరలోనే దీని పై మరింత క్లారిటీ ఇవ్వనున్నారు. జనవరి 12న సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే