AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2025 | 12:13 PM

Share

హీరోలే కాదు హీరోయిన్స్ కూడా స్టార్ డమ్‌తోపాటు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే మనది దగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ ఉన్నారు. అలాగే స్టార్ డమ్ ట్యాగ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్ గా అభిమానులు ఈ అమ్మడిని ముద్దుగా పిలుచుకుంటుంటారు. సాయి పల్లవి నేటి తరం సౌందర్య అని చాలా మంచి పోల్చుతూ ఉంటారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు ఎంచుకునే కథలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇటీవలే తండేల్, అమరన్ సినిమాలతో విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి నటిస్తుంది. అలాగే రావణుడిగా యష్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ లో తనకంటూ క్రేజ్ సొంతం చేసుకున్న శింబు. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్‌లో సాయి పల్లవిని సెలక్ట్ చేశారని టాక్ వినిపిస్తుంది. గతంలో ధనుష్‌ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే సినిమా చేశారు వెట్రిమారన్.. ఇప్పుడు అదే తరహాలో మరోసారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. శింబు కెరీర్ లో 49వ సినిమా ఇది. సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందని కోలీవుడ్ లో వార్తలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.

ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.