శ్రీదేవి తర్వాత అంత అందగత్తె.! ఇప్పుడు ఇలా అయిపొయింది పాపం..!
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు శ్రీదేవితో పోటీపడింది ఆ హీరోయిన్. కానీ ఇప్పుడు జ్ఞాపకశక్తి తగ్గడంతో సినిమాలు మానేశారు.

సినిమా ఇండస్ట్రీని తన అందంతో, నటనతో చెరిగిపోని ముద్ర వేశారు శ్రీదేవి. వయసుతో సంబంధం లేకుండా ఎన్నోరకాల పాత్రల్లో నటించారు. వయసులో తనకన్నా పెద్ద హీరోలతో నటించారు. అలాగే తనకన్నా చిన్న హీరోలతోనూ నటించారు శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీదేవితో పాటు అందంలోనూ, నటనలో పోటీ పడ్డ అందాల భామలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. మతిమరుపుతో బాధపడుతుంది ఆమె.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్
అలనాటి అందాల తారల్లో భానుప్రియ ఒకరు. భాను ప్రియా అంటే ఒకప్పుడు సంచలనం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది భాను ప్రియా. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాలకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూలో ఉండేవారు.అందంలోనూ నటనలోనూ ఆమెకు ఎవరు పోటీ లేరు అని నిరూపించారు భాను ప్రియా. దాదాపు సీనియర్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు భాను ప్రియా.
ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవిలాంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు భాను ప్రియా. ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తున్నారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా అద్భుతంగా నటించి మెప్పించారు భాను ప్రియా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు భానుప్రియ. మొన్నామధ్య భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భర్త మరణం నన్ను బాగా కుంగదీసింది. ఆతర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వల్ల డైలాగ్స్ గుర్తుండటంలేదు. అందువల్లే సినిమాలు మానేశా అని తెలిపారు భానుప్రియ.
ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




