అప్పుడు కొడుకుతో.. ఇప్పుడు తండ్రితో.. పూజా హెగ్డే లక్ మాములుగా లేదుగా..
హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. ఒక లైలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇక ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా నటించింది. ఆతర్వాత గ్లామర్ డాల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో ఏకంగా బికినీ లో కనిపించి మెప్పించింది. ఆతర్వాత తన అందాలతో మెప్పిస్తుంది. ఇక పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ గా మారింది. అలాగే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ అమ్మడు. కాగా ఇప్పుడు ఈ చిన్నది ఓ స్టార్ హీరోతో కలిసి నటిస్తుందని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
ఇప్పటికే పూజా ఎంతో మంది యంగ్ హీరోలతో కలిసి నటించింది.. ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. కాగా అప్పుడు కొడుకుతో కలిసి నటించిన పూజా హెగ్డే ఇప్పుడు తండ్రి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకూ ఆ సీనియర్ హీరో ఎవరో తెలుసా టాలీవుడ్ కింగ్ నాగార్జున. పూజా హెగ్డే అక్కినేని యంగ్ హీరోలతో నటించిన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
కాగా ఇప్పుడు నాగార్జునతో పూజా హెగ్డే కలిసి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో పూజా రజినీకాంత్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె నాగార్జున సరసన కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..