Nani : వరుస ఫ్లాప్స్‌లో ఉన్న భామకు క్రేజీ ఆఫర్.. మరోసారి ఆ హీరోయిన్‌తో నాని రొమాన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో హిట్ 3 సినిమా ఒకటి, ప్యారడైజ్ మరొకటి.

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడు మరో మూడు సినిమాలను లైనప్ చేశారు. హీరోగానే కాదు నాని నిర్మాతగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ గానే కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు హిట్ 3, ప్యారడైజ్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా నుంచి నాని లుక్ ను రిలీజే చేశారు. అలాగే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయగా అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణ యాసలో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. ఇక దసరా సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలోనూ కీర్తిసురేష్ నటిస్తుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.
ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతిశెట్టి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. వరుసగా మూడు హిట్స్ అందుకున్న కృతిశెట్టి.. ఆతర్వాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు కృతి శెట్టి నాని సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనుందట కృతిశెట్టి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
