- Telugu News Photo Gallery Cinema photos Isn't there a big clash between South and North? What movie is competing with Coolie?
Coolie: కూలీకి పోటీగా పాన్ ఇండియా నార్త్ మూవీ.. బిగ్ క్లాష్ తప్పదా.?
ఇంట్రస్టింగ్ ఫైట్‌కు తెర తీశారు కూలీ మేకర్స్. రిలీజ్ డేట్ లాక్ చేసిన తలైవా... సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో బిగ్ క్లాష్ తప్పదన్న సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ రజనీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడూ? తలైవాతో తలపడబోయే ఆ స్టార్ ఎవరు..? నిజంగానే బిగ్ స్క్రీన్ మీద ఇంత బిగ్ క్లాష్ జరగనుంది..? ఎవరైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా..? ఈ స్టోరీలో చూద్దాం.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 08, 2025 | 9:36 AM

సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ మార్క్ మాస్ యాక్షన్‌కు రజనీ ఇమేజ్, స్టైల్‌ను యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.

లియో సినిమా హరిబరిగా రిలీజ్ చేయాల్సి రావటంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మ్యాగ్జిమమ్ టైమ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు.

అయితే ఆ డేట్‌కు ఆల్రెడీ వార్ 2 టీమ్ కర్చీఫ్ వేసింది. ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తే లేదని మరోసారి కన్ఫార్మ్ చేసింది కూడా. కూలీ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు.

ఈ రెండు సినిమాలు సేమ్ డేట్‌కు వస్తుండటంతో, సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు. ఆమిర్, హృతిక్ పోటి పడుతుండటంతో సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది.

దక్షిణాదిలో రజనీ వర్సెస్ ఎన్టీఆర్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా మారింది. తెలుగులో ఎన్టీఆర్, తమిళ్‌లో రజనీ ఇద్దరూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నవారే. రీసెంట్ టైమ్స్‌లో ఈ ఇద్దరూ పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన వారే. అందుకే ఈ ఇద్దరి సినిమాల మధ్య క్లాష్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అవుతుంది.





























