- Telugu News Photo Gallery Cinema photos Will L2 Empuraan become a game changer for the Malayalam industry?
L2 Empuraan: గేమ్ ఛేంజర్‌గా ఎల్ 2 ఎంపురాన్.. మలయాళీ ఇండస్ట్రీ దశ మారనునందా.?
ప్రతీ ఇండస్ట్రీలో గేమ్ చేంజింగ్ మూవీ అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి సినిమాలు.. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ లెక్కలు మార్చి, కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తాయి. రీసెంట్‌గా మలయాళ ఇండస్ట్రీలో అలాంటి సినిమా ఒకటి వచ్చింది. మాలీవుడ్ ఇంత వరకు చూడని బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేస్తున్న ఆ సినిమా వివాదాల విషయంలోనూ అదే స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
Updated on: Apr 08, 2025 | 10:09 AM

మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఓ పాత్రలో నటించిన మలయాళీ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా చిత్రం లూసీఫర్. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎల్ 2 ఎంపురాన్ మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎంపురాన్ అదే స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 48 గంటల్లోనే 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా మాలీవుడ్ కనీవినీ ఎరుగని రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు 300 కోట్లకు చేరువలో ఉంది.

టాలీవుడ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన గేమ్ చేంజింగ్ మూవీ బాహుబలి, కన్నడ ఇండస్డ్రీలో అలాంటి మార్పులకు కారణమైంది కేజీఎఫ్, పాన్ ఇండియా రేంజ్ కాకపోయినా... తమిళనాట రోబో కూడా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది.

అయితే ఈ లిస్ట్‌లో మలయాళ సినిమా కాస్త వెనుకపడింది. ఫైనల్‌గా మాలీవుడ్‌లోనే గేమ్ చేంజింగ్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎల్ 2 ఎంపురాన్ కోలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సినిమా ఇంతటి విజయం సాధించటం వెనుక వివాదాలు కూడా హెల్ప్ అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే నేషనల్ లెవల్‌లో రచ్చ జరుగుతుండటంతో రోజు ఏదో ఒకరకంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది ఎల్ 2 ఎంపురాన్.




