- Telugu News Photo Gallery Cinema photos Director Sailesh Kolanu posted an emotional post on the leaks from Hit The Third Case
HIT 3: హిట్ 3 నుంచి లీక్స్.. డైరెక్టర్ శైలేష్ ఎమోషనల్‌గా పోస్ట్..
టెక్నాలజీ పెరిగిన తరువాత ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లీక్స్. ఎంత పెద్ద సినిమా అయినా... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఏదో ఒక రకంగా లీకులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా హిట్ సిరీస్ డైరెక్టర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ కావటంతో అసలు లీకుల విషయంలో ఎవరి బాధ్యత ఎంతా అన్న చర్చ మొదలైంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 08, 2025 | 10:41 AM

హిట్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్న దర్శకుడు శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 'థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేసే ప్రతీ మూమెంట్ కోసం ఓ పెద్ద టీమ్, పగలు, రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతుంది. వాళ్లంతా తమ శక్తికి మించి పని చేస్తారు. అందంత కేవలం ఆ ఫ్రేమ్‌ను అద్భుతంగా చూపించడానికే' అంటూ కామెంట్ చేశారు.

అయితే ఈ పోస్ట్ రీసెంట్ లీకు గురించే అన్న టాక్ వినిపిస్తోంది. హిట్ 3 సినిమాలో కార్తీ నటిస్తున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్‌లో సర్‌ప్రైజ్ చేయాలనుకున్న శైలేష్‌కు ఈ లీకు షాక్ ఇచ్చింది. అందుకే అంత ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.

అయితే లీకుల సమస్య వచ్చిన ప్రతీ సారి ఇండస్ట్రీ ఆ బ్లేమ్‌ను సోషల్ మీడియా, మీడియా మీద తోయటం కరెక్ట్ కాదంటున్నారు క్రిటిక్స్. చాలా సందర్బాల్లో మేకర్స్ కావాలనే సినిమాకు సంబంధించి, లీక్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలా వచ్చిన లీకుల సినిమా మీద మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయి.

ఆలస్యమవుతున్న సినిమాలను ఇలాంటి లీకులతోనే వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తమకు అవసరం వచ్చినప్పుడు మేకర్సే లీక్ ఇవ్వటం, అవి మిస్ ఫైర్ అయినప్పుడు సోషల్ మీడియా మీద కామెంట్ చేయటం ఎంత వరకు కరెక్ట్ అన్న క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటె హిట్ సిరీస్‌లో థర్డ్ ఇంస్టాల్మెంట్గా వస్తున్న హిట్: ది థర్డ్ కేస్ సినిమా నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మే 1 ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటీకే వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఆకట్టుకున్నాయి.





























