- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna's target is another big achievement by next year
Rashmika Mandanna: నెక్స్ట్ ఇయర్ కల్లా రష్మిక మరో బిగ్ అచ్చీవ్‌మెంట్.. ఏంటది.?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, నెక్స్ట్ ఇయర్ కల్లా మరో బిగ్ అచ్చీవ్‌మెంట్‌ను టార్గెట్ చేస్తుందట. ఏంటా అచ్చీవ్‌మెంట్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 08, 2025 | 11:15 AM

కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ రష్మిక మందన్న. ముఖ్యంగా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ భామ, పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ముందే యాడ్ అయిన నేషనల్ క్రష్ ట్యాగ్ లైన్ కూడా రష్మిక నార్త్ ఎంట్రీకి చాలా హెల్ప్ అయ్యింది. ఈ జనరేషన్‌లో నార్త్‌లో కమర్షియల్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సౌత్ బ్యూటీగా నయా రికార్డ్ సెట్ చేసింది రష్మిక మందన్న.

మిగతా హీరోయిన్లు బాలీవుడ్‌లో సక్సెస్ వేటలో తడబడుతుంటే రష్మిక మాత్రం సూపర్ ఫామ్‌లో దూసుకుపోతుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జోడి కడుతూ నెంబర్ గేమ్‌లో దూసుకుపోతుంది టాలీవుడ్ శ్రీవల్లి. రీసెంట్‌గా సికందర్ సినిమా షాకిచ్చినా... బాలీవుడ్‌లో ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

అందుకే నెక్స్ట్ ఇయర్ కల్లా బాలీవుడ్ టాప్ బ్యూటీస్‌కు కూడా రష్మిక పోటిస్తారంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా నటనతో పాటు గ్లామర్ షో విషయంలోనూ ఉత్తరాది భామలకు ఏ మాత్రం తగ్గటం లేదు శ్రీవల్లి. అది కూడా ఈ బ్యూటీ కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతోంది.

ప్రస్తుతం తెలుగు కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటు బాలీవుడ్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమలో థమాలో ప్రధానపాత్రలో నటిస్తుంది. ఇంకా మరికొన్ని సినిమాలకు ఈ బ్యూటీ పేరు బాగా వినిపిస్తుంది.





























