Naga Chaitanya: నాగ చైతన్య.. జాన్వీ కపూర్.. ఓ అందమైన ప్రేమ కథ
మత్యకారుల జీవిత కథతో తండేల్ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
అక్కినేని యంగ్ హీరో ఆగ చైతన్య ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం గట్తిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కెరీర్ లో ఏ మాయ చేశావే , మజిలీ, లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. మత్యకారుల జీవిత కథతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య చేయబోయే సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండేల్ సినిమా తర్వాత నాగ చైతన్య ఓ సింపుల్ లవ్ స్టోరీ చేయనున్నాడని తెలుస్తోంది. అదికూడా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో.. అతను ఎవరో కాదు. నాగ చైతన్య కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మజిలీ. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణతో మరోసారి నాగ చైతన్య సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. జాన్వీ ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ . ఇక ఇప్పుడు ఈ అమ్మడు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో సినిమా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాగ చైతన్య కోసం శివ ఓ అందమైన ప్రేమకథను సిద్ధం కూడా చేశాడట. మరి ఏంజరుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.