Samantha: ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు..? అంతగా ఆమె ఏం చేసింది…?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల జీవితం మరీ తెరిచిన పుస్తకంలా మారింది. సినిమాల విషయాలతో పటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు పలువురు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల జీవితం మరీ తెరిచిన పుస్తకంలా మారింది. సినిమాల విషయాలతో పటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు పలువురు. ఇక సెలబ్రెటీలు ముఖ్యంగా సినిమా తారలు ఏ చిన్న తప్పు చేసిన, చేయకపోయినా ట్రోలర్స్ మాత్రం రెడీగా ఉంటారు. ఇప్పుడు ఓ వయ్యారి భామ కూడా ట్రోలర్స్ దొరికిపోయింది. రోజూ ఈ అమ్మడిని కొంతమంది ట్రోల్ చేయడం.. వారికీ ఆ బ్యూటీ స్ట్రాంగ్ రీప్లే ఇవ్వడం.. కామన్ అయిపోయింది. ఇదే ఇప్పుడు సమంత విషయంలో జరుగుతోంది. సమంత(Samantha) ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఏం మాయ చేశావే సినిమాతో పరిచయం అయినా ఈ అమ్మడు కుర్రాలందరిని ఆ సినిమాతో మాయ చేసేసింది. సమంత స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్టార్ హీరోల సినిమాలు నేరుగా ఈ చిన్నదాని వెతుకుంటూ వచ్చాయి.
ఆతర్వాత అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడింది ఈ సుందరి. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది సామ్. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులు అంటూ ట్విస్ట్ ఇచ్చింది. కారణం చెప్పలేదు కానీ విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి అందరిని షాక్ చేసింది. కానీ ఆ తర్వాతే షరామామూలుగా సామ్ పై దృష్టి పెట్టారు నెటిజన్స్. విడాకులకు కారణం సమంతే అని ఆ మధ్య కొంతమంది కామెంట్ల వర్షం కురిపించారు. దీని పై సమంత కూడా ఘాటుగానే స్పందించింది. ఇక ఇప్పుడు సమంత ఏ చిన్న పోస్ట్ పెట్టిన ట్రోల్స్ చేయడం నెటిజన్లకు పరిపాటి అయ్యింది. సమంత భాదపడుతూ పోస్ట్ పెట్టినా.. సంతోషంగా ఉన్న పోస్ట్ పెట్టిన ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు ఈ అమ్మడి పైన. నిజానికి సామ్ చైతూ విడిపోయిన తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ సమంత విషయంలో మాత్రం రోజూ ఎదో ఒక వార్త నడుస్తూనే ఉంది. రీసెంట్ గా ట్రోల్స్ పైన విసిగిపోయిన సామ్.. ‘మేము మూవ్ ఆన్ అయ్యాం.. మీ పని మీరు చూసుకోండి’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.. అయినా కూడా నెటిజన్లు మాత్రం సమంతను వదలడం లేదు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అంటూ నిట్టూరుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








