AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna:పెట్‌డాగ్‌ కోసం ఫ్లైట్‌ టికెట్స్‌ డిమాండ్‌ చేసిన నేషనల్‌ క్రష్‌.. మరి శ్రీవల్లి స్పందనేంటో తెలుసా?

Rashmika Mandanna: ప్రస్తుతం సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాప్‌ గేర్‌తో దూసుకుపోతోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ తన హవా చూపిస్తోంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమా పుష్ప..

Rashmika Mandanna:పెట్‌డాగ్‌ కోసం ఫ్లైట్‌ టికెట్స్‌ డిమాండ్‌ చేసిన నేషనల్‌ క్రష్‌.. మరి శ్రీవల్లి స్పందనేంటో తెలుసా?
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Jun 25, 2022 | 2:43 PM

Share

Rashmika Mandanna: ప్రస్తుతం సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాప్‌ గేర్‌తో దూసుకుపోతోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ తన హవా చూపిస్తోంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమా పుష్ప (Pushpa)  తర్వాత నేషనల్‌ లెవెల్లో క్రేజ్‌ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంటుంది. అందులో తన పెట్‌డాగ్ ఆరాతో దిగిన ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. కాగా ఇటీవల రష్మికపై ఒక రూమర్‌ నెట్టింట్లో బాగా హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. ఇటీవల తన సినిమా షూటింగ్‌లో భాగంగా నిర్మాతలను ఆమె బాగా ఇబ్బంది పెడుతోందట. ముఖ్యంగా షూటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మరొకచోటుకు వెళ్లేటప్పుడు తనతో పాటు తన పెట్‌డాగ్‌కు కూడా ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేయాలని నిర్మాతలను డిమాండ్‌ చేస్తోందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. అవి కాస్తా శ్రీవల్లి కంట పడ్డాయి.

ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయో..

ఈక్రమంలో తన పెట్‌డాగ్‌పై వస్తోన్న రూమర్లను ట్విట్టర్‌ వేదికగా కొట్టిపారేసింది రష్మి. తనపై వచ్చిన వార్తలకు సంబంధించిన స్ర్కీన్‌షాట్స్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..’హే.. ఇలాంటి రూమర్స్‌ ఎలా సృష్టిస్తారో అర్థం కావడం కాదు. ఆరాకు నాతో కలిసి ట్రావెల్‌ చేయాలని మీరుకోరుకున్నా.. తనకు మాత్రం నాతో జర్నీ చేయడం అసలు ఇష్టముండదు. తను హైదరాబాద్‌లోనే హ్యాపీగా ఉంటుంది’ అంటూ స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఆ తర్వాత మరో ట్వీట్‌లో.. ‘క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా’ అంటూ కామెంట్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో చర్చనీయాంశమవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా నేషనల్‌ శ్రీవల్లికి సపోర్టుగా నిలుస్తున్నారు. ‘ఇదొక్కటే కాదు.. ఇలాంటి రూమర్లు చాలా వస్తున్నాయి’ అని ఓ నెటిజన్‌ స్పందించగా.. ‘ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్‌’ అని రిప్లై ఇచ్చింది రష్మిక. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘పుష్ప 2, వారసుడు, సీతారామం చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో యానిమల్, మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్