Bollywood: పెద్ద ప్లానే.. సౌత్ పాన్ ఇండియన్ సినిమాలను గట్టిగా ఎదిరిస్తున్న హీరో..

మూడే మూడు సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లారు జక్కన్న. రాజమౌళి తర్వాత కేజీఎఫ్ అంటూ ముందుకువచ్చారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ ను పెట్టి ఏకంగా ఈ  భారీ యాక్షన్ ఫిలింను రెండు పార్టులుగా తెరకెక్కించి..

Bollywood: పెద్ద ప్లానే.. సౌత్ పాన్ ఇండియన్ సినిమాలను గట్టిగా ఎదిరిస్తున్న హీరో..
Pan India Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 25, 2022 | 3:28 PM

ఒకప్పుడు సౌత్ సినిమా అంటే అంతో ఇంతో చిన్న చూపు ఉండేది.. ఈ విషయాన్నీ ఇటీవల ఓ వేదిక పైన మెగాస్టార్ కూడా చెప్పుకొచ్చారు.. తాను వెళ్లిన ఓ ఫంక్షన్లో అందరి హీరోల ఫోటోలు ఉన్నాయి కానీ.. మన సౌత్ వాళ్ళ ఫోటోలు లేకపోవడం బాధ కలిగించిందని మెగాస్టార్ ఒకింత ఎమోషనల్ అయ్యారు కూడా.. కానీ ఇప్పుడు జక్కన్న ఆలోటును తీర్చారని  బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ సినిమా స్థాయిని ఎక్కడికో.. తీసుకెళ్లారని రాజమౌళిని ఆకాశానికెత్తారు చిరు. నిజమే మూడే మూడు సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లారు జక్కన్న. రాజమౌళి తర్వాత కేజీఎఫ్ అంటూ ముందుకువచ్చారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ ను పెట్టి ఏకంగా ఈ  భారీ యాక్షన్ ఫిలింను రెండు పార్టులుగా తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే సుకుమార్ పుష్ప అంటూ మరో అడుగు ముందుకేశారు. దాంతో సౌత్ సినిమాల సౌండ్ వరల్డ్ వైడ్ గా గట్టిగా వినిపించింది. అంతే కాదు బాలీవుడ్ లో ఈ సినిమాలు సత్తా చాటాయి. ఈ మూడు సినిమాల దెబ్బకు బాలీవుడ్ కుదేలైందనే చెప్పాలి. అక్కడి హీరోలు సాధించని రికార్డులను మనోళ్లు జేబులో వేసుకోవడంతో బి టౌన్ స్టార్ హీరోలంతా నోరెళ్లబెట్టారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ పెంచే బాధ్యతను భుజానకెత్తుకున్నాడు చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్.

ఖాన్ లను, సీనియర్ హీరోలను సైతం కాదని రణబీర్ చేస్తున్న సాహసం ఏంటి అనుకుంటున్నారా..? అదేంటంటే పాన్ ఇండియా సినిమాలు చేయడం కేవలం సౌత్ హీరోలకు మాత్రమే సొంతం కాదు అంటూ ఏకంగా రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు రణబీర్. ఈ యంగ్ హీరో నటిస్తోన్న బ్రహ్మాస్త్ర, షంషేరా రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవ్వనున్నాయి. బ్రహ్మాస్త్ర విషయానికొస్తే సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు.. తెలుగు స్టార్ హీరో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే షంషేరా సినిమా విషయానికొస్తే పిరియాడికల్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. రణబీర్ దోపిడీ దొంగగాకనిపించనున్న ఈ సినిమాలో బాడ్ మ్యాన్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర, షంషేరా రెండు సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. దేనికదే విభిన్నంగా, ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా అయిన క్లిక్ అయితే మాత్రం బాలీవుడ్ రేంజ్ ను పెంచిన హీరోగా రణబీర్ పేరు మారుమ్రోగిపోతుంది. మరి రణబీర్ ఆశలను ఈ సినిమాలు నిలబెడతాయేమో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్