AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ ఈసారి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా.. ఫ్యాన్స్ ఆశ కూడా అదే

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు హవా ఎక్కువైపోయింది. ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేసిన వెంటనే ఫ్లాప్ వస్తుందని, టైటిల్ కార్డు ఈ కలర్ లో ఉంటేనే కలిసొస్తుందని, అ అనే అక్షరంతో టైటిల్ తోనే సినిమా ఉండాలని..

Mahesh Babu: మహేష్ ఈసారి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా.. ఫ్యాన్స్ ఆశ కూడా అదే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jun 25, 2022 | 3:48 PM

Share

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు హవా ఎక్కువైపోయింది. ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేసిన వెంటనే ఫ్లాప్ వస్తుందని, టైటిల్ కార్డు ఈ కలర్ లో ఉంటేనే కలిసొస్తుందని, అ అనే అక్షరంతో టైటిల్ తోనే సినిమా ఉండాలని.. ఇలాంటి చాలా సెంటిమెంట్లు నిత్యం మనం వింటూనే ఉన్నాం. అయితే మహేష్(Mahesh Babu), త్రివిక్రమ్ సినిమాకు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అయితే అది ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చని సెంటిమెంట్. మహేష్ త్రివిక్రమ్ కాబినేషన్ లో సినిమా వచ్చి దాదాపు 11 ఏళ్ళు అయిపోయింది. ఈ క్రేజీ కాంబో కోసం మహేష్ అభిమానులు కళ్ళలో వత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నాం అని అనౌన్స్ చేయడం తో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మహేష్ కెరీర్ లో 28వ సినిమా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న సూపర్ స్టార్ ‘ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఓ సెంటిమెంట్ ఫ్యాన్స్ ను తెగ కంగారు పెడుతోంది. అదేంటంటే..

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎందుకనో ఈ సినిమాను థియేటర్ లో చూసిన జనాలకు ఎక్కలేదు. అదే సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యేసరికి అర్రే సినిమా సూపర్ ఉందే.. అంటూ మెచ్చుకున్నారు. అలాగే ఖలేజా విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకూడా ధియేటర్ లో బోల్తా కొట్టింది అనిపించింది. కానీ టీవీలో చూసిన తర్వాత.. ఇంత మంచి సినిమా థియేటర్ లో ఎందుకు హిట్ అవ్వలేక పోయిందా అని అంతా అనుకున్నారు. ఇప్పటికీ ఈ రెండు సినిమా ప్రేక్షకులకు ఆల్ టిల్ ఫేవరేట్ సినిమాలుగా మిగిలిపోయాయి. అయితే ఈ సారి మాత్రం ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ప్రస్తుతం చేస్తున్న SSMB 28 మాత్రం థియేటర్ లో దుమ్మురేపడం ఖాయం అంటున్నారు అభిమానులు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ సినిమా మహేష్ అభిమానుల ఆశలను ఏ మేరకు నిలబెడుతోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ బాహుబలి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ బాహుబలి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్