Keerthy Suresh :ఈ బ్యాడ్ లక్ సఖిని.. గుడ్ లక్ సఖిగా మార్చే హీరో ఎవరో..?

కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్న పన్ను ఊడుతుంది అన్నది పెద్దవాళ్ళు చెప్పే సామెత.. ఇదే సామెత ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ విషయంలోనూ జరుగుతుందని అనిపిస్తుంది.

Keerthy Suresh :ఈ బ్యాడ్ లక్ సఖిని.. గుడ్ లక్ సఖిగా మార్చే హీరో ఎవరో..?
Keerthi Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 25, 2022 | 4:33 PM

కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్న పన్ను ఊడుతుంది అన్నది పెద్దవాళ్ళు చెప్పే సామెత.. ఇదే సామెత ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ విషయంలోనూ జరుగుతుందని అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. స్టార్ హీరోల సరసన మెరుస్తోన్న  సక్సెస్ మాత్రం దక్కడం లేదు ఈ అమ్మడికి. తెలుగు,తమిళ్ అని తేడా లేకుండా చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేకుండా నటిస్తున్నా.. అవి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొడుతున్నాయి. అంతగా దురదృష్టాన్ని వెంటేసుకొని తిరుగుతోన్న హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh). మొదటి సినిమా తర్వాత ఎక్స్ప్రెషన్స్ లెస్ బ్యూటీ అని కొంతమంది కామెంట్ చేశారు. ఆ తర్వాత ముద్దుగుమ్మ అంటూ ప్రశంసలు కురిపించారు. ఏకంగా మహానటి నాటు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఇప్పుడు మాత్రం బ్యాడ్ లక్ సఖి అంటున్నారు ఈ అమ్మడిని.

నేను శైలజ సినిమాతో పరిచయం అయినా ఈ భామ.. తెలుగులో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్  గా మారిపోయింది. ఈ చిన్నదాని కెరీర్ కు మహానటి టాప్ గేర్ వేసింది. అప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే సాలిడ్ హిట్ మాత్రం ఈ అమ్మడు అందుకోలేకపోతోంది. మహానటి సినిమాతర్వాత ఆ రేంజ్ హిట్ ఇంతవరకు ఈ అమ్మడుకు దక్కలేదు. తెలుగు , తమిళ్ లో కలిపి 20 వరకు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. లాభం లేదని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అమ్మడిని అడ్డుకోలేకపోయారు. ఆయనతో కలిసి చేసిన అన్నత్తే సినిమా దారుణంగా నిరాశ పరిచింది. ఇక రీసెట్ గా మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాటతో వచ్చింది ఈ బాబ్లీ బ్యూటీ. ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తి ఈ సినిమాలో కాస్త కంచె దాటింది. మునపటి సినిమాల కంటే గ్లామర్ షో పంచింది. అయితే ఈ సినిమా పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఆ క్రెడిట్ అంతా సూపర్ స్టార్ మహేష్ బాబుకు, దర్శకుడు పరశురామ్ కు వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడుకు అర్జెంట్ గా సాలిడ్ హిట్ కావాలి.. లేకపోతే కెరీర్ ఖతం అయ్యే ప్రమాదం ఉంది. దాంతో తనకు హిట్ ఇచ్చే హీరో కోసం ఎదురుచూస్తోంది ఈ కళావతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి