Sita Ramam Teaser : యుద్ధంతో రాసిన అందమైన ప్రేమకథ.. ‘సీతారామం’ టీజర్

మలయాళం స్టార్ హీరోల్లో ముందు వరసలో ఉంటాడు హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan ). కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.

Sita Ramam Teaser : యుద్ధంతో రాసిన అందమైన ప్రేమకథ.. 'సీతారామం' టీజర్
Sita Ramam
Follow us

|

Updated on: Jun 25, 2022 | 4:55 PM

మలయాళం స్టార్ హీరోల్లో ముందు వరసలో ఉంటాడు హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan ). కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమా సీతారామం. హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దుల్కర్ మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దుల్కర్. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంది విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్. ఈ సినిమాలో శివాజీ గణేష్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు దుల్కర్. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యాడు.

తాజాగా ఈ సినిమా ట్రీజర్ ను రిలేజ్ చేశారు చిత్రయూనిట్. ‘లెఫ్ట్ నెంట్ రామ్ నిన్నే నాకు పరిచయమైన పేరు. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ ఒంటరి సైనికుడు’.. అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతోంది. ‘మాట్లాడటానికి ఓ కుటుంబం.. కనీసం ఉత్తరం రాయడానికి ఓ పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’.. అంటూ హీరో క్యారెక్టరైజేషన్ ను టీజర్ లో వివరించారు. అయితే అనుకోకుండా అతడికి ఉత్తరాలు రావడం మొదలవుతోంది. సీతామహాలక్ష్మీ అనే అమ్మాయి నేను మీ భార్యను మీకోసం ఎదురుచూస్తున్నాను అంటూ  ఉత్తరాలు రాస్తుంది. ఆమె ఎవరో చూడాలని హీరో అనుకుంటాడు. ఇదంతా టీజర్ లో చూపించారు. ఈ టీజర్ బట్టి చూస్తుంటే ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథ అని అర్ధం అవుతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి