AHA: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్.. ఆహా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఉచితంగా చూసే ఛాన్స్. ఒక్క రోజే సుమా..
తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఏ రేంజ్‌లో విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా, రెండింటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. రికార్డు వ్యూస్‌తో ఓటీటీలో అరుదైన రికార్డు సృష్టించింది. అప్పటి వరకు నటనకు పరిమితమైన...

తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఏ రేంజ్‌లో విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా, రెండింటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. రికార్డు వ్యూస్‌తో ఓటీటీలో అరుదైన రికార్డు సృష్టించింది. అప్పటి వరకు నటనకు పరిమితమైన నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారిన ఈ షోతో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ తన మార్క్ ఫన్‌తో ఇంటర్వ్యూకి హాజరైన అతిథులపై ప్రశ్నలు సంధించారు.
ఇక సెకండ్ సీజన్‌లో బాగా పాపులర్ అయిన ఇంటర్వ్యూల్లో ప్రభాస్‌ది ఒక్కటి. పెద్దగా ఎప్పుడు మాట్లాడని ప్రభాస్‌తో బాలకృష్ణ మాట్లాడించిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఆహా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్‌ను ఉచితంగా చూసే అవకాశాన్ని కలిపించింది. అయితే ఈ ఛాన్స్ కేవలం ఒక్కరోజు మాత్రమే. వీకెండ్ సందర్భంగా శనివారం ఒక్కరోజు ఉచితంగా వీక్షించొచ్చు.
Dear darling fans! Thank you for all the love for #UnsotppableWithNBKS2 #PrabhasOnAha. Here’s a return gift for you all. Watch the blockbuster episode for free, only today!#NandamuriBalakrishna #Prabhas Watch Unstoppable 2 The Bahubali Episode – Part 1 https://t.co/Rc2nU886qL pic.twitter.com/buWl9tLsmd
— ahavideoin (@ahavideoIN) May 27, 2023
ఇదిలా ఉంటే ఆహా ‘సమ్మర్ బాక్సాఫీస్’ పేరుతో రోజుకో సినిమాను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే.. ‘మసూద, ‘కలర్‌ఫొటో’ ‘క్రాక్’ చిత్రాలను ఉచితంగా చూసే ఛాన్స్ ఇచ్చింది. అయితే, ఏ రోజు ఏ సినిమా ఉచితంగా చూడొచ్చు అనే విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ శనివారం అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..