War 2 Box Office Collections Day 1: వార్ 2 కలెక్షన్స్.. బాలీవుడ్లో దుమ్మురేపిన ఎన్టీఆర్.. ఆ విషయంలో రికార్డ్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సోలోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దామా.

భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన సినిమా వార్ 2. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. YRF యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమాలో హృతిక్, తారక్ యాక్షన్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం అన్ని భాషలలో కలిపి రూ. 52.5 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం హిందీలో 29 కోట్లు, తమిళంలో 0.25 కోట్లు, తెలుగులో 23.25 కోట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
వార్ 2 సినిమాకు ముంబై, ఢిల్లీ, NCR ప్రాంతాలలో వరుసగా 1100 నుంచి 1400 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో వరుసగా 22 నుంచి 31 శాతం వరకు ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక హైదరాబాద్ లో వార్ 2 సినిమాకు మొత్తం 500 ప్రదర్శనలు ఇచ్చింది. దాదాపు 77 శాతం ఆక్యుపెన్సీతో హైదరాబాద్ లో ప్రదర్శించారు. 2019లో వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో తారక్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో కనిపించారు. ఈ ఏడాదిలో మొదటి రోజే అత్యధిక వసూల్లు రాబట్టిన రెండో సినిమాగా వార్ 2 నిలిచింది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
గతంలో YRF యూనివర్స్‌లో భాగంగా వచ్చిన వార్ (2019) మొదటి రోజున రూ.53 కోట్లు వసూలు చేసింది. ఇందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 (2023) మొదటి రోజునే రూ.44.5 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..







