AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం.. అత్యాచారం కేసులో హీరోయిన్ అరెస్ట్.. బాలికను హోటల్‌కు తీసుకెళ్లి..

ఆమెకు 16 ఏళ్లు.. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం.. అది వాళ్లకు సాకుగా మారింది.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది.. సినిమాల్లో ఎలాగైనా నటించాలని.. చివరకు వాళ్ల దగ్గరకు వెళ్లింది.. అలా వెళ్లిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో.. నలుగురు అఘాాయిత్యానికి పాల్పడ్డారు..

సంచలనం.. అత్యాచారం కేసులో హీరోయిన్ అరెస్ట్.. బాలికను హోటల్‌కు తీసుకెళ్లి..
Minu Muneer
Shaik Madar Saheb
|

Updated on: Aug 15, 2025 | 11:24 AM

Share

ఆమెకు 16 ఏళ్లు.. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం.. అది వాళ్లకు సాకుగా మారింది.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది.. సినిమాల్లో ఎలాగైనా నటించాలని.. చివరకు వాళ్ల దగ్గరకు వెళ్లింది.. అలా వెళ్లిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో.. నలుగురు అఘాాయిత్యానికి పాల్పడ్డారు.. ఇది జరిగిన పదేళ్ల తర్వాత ఆ యువతి.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి.. పోలీసులను ఆశ్రయించింది.. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని.. ఈ కేసులో మలయాళ సినీ నటి మిను మునీర్‌ (51) ను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం మిను మునీర్‌ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చింది.. ఆ తర్వాత ఓ ప్రైవేటు హోటల్‌లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్‌ ఉమెన్‌ పోలీసులు నటి మిను మునీర్‌ను గురువారం అరెస్టు చేశారు.. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ యువతికి 26 ఏళ్లని.. ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తరువాత, ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో, తన కుమార్తెను తన దూరపు బంధువు మినుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది.

ఆమె ఆ అమ్మాయిని అన్నా నగర్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి, ఆమెను నలుగురు వ్యక్తులకు పరిచయం చేసి, సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని.. కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే.. అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

కేరళలోని ఎర్నాకులంకు చెందిన మిను మునీర్ అలియాస్ మిను కురియన్.. 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో, కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
ఇలా చేస్తే సెన్లలోనే వెల్లుల్లి పొట్టు తీయొచ్చు.. సింపుల్ ట్రిక్
ఇలా చేస్తే సెన్లలోనే వెల్లుల్లి పొట్టు తీయొచ్చు.. సింపుల్ ట్రిక్
ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!
ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!
తన కన్నా ముందే తన కొడుకు చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు..
తన కన్నా ముందే తన కొడుకు చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు..
కోహ్లీ ఈజీ క్యాచ్ డ్రాప్.. స్టేడియంలో నవ్వు ఆపుకోలేకపోయిన అనుష్క
కోహ్లీ ఈజీ క్యాచ్ డ్రాప్.. స్టేడియంలో నవ్వు ఆపుకోలేకపోయిన అనుష్క
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
బాలకృష్ణ సినిమాలో డింపుల్ హయాతి.. కౌంటరిచ్చిన గోపిచంద్..
బాలకృష్ణ సినిమాలో డింపుల్ హయాతి.. కౌంటరిచ్చిన గోపిచంద్..
గుడ్లు ఎక్కువగా తింటే ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి వస్తుందా?
గుడ్లు ఎక్కువగా తింటే ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి వస్తుందా?
PSLలోకి స్టీవ్ స్మిత్ గ్రాండ్ ఎంట్రీ..తొలి మ్యాచ్‌లో భీభత్సం
PSLలోకి స్టీవ్ స్మిత్ గ్రాండ్ ఎంట్రీ..తొలి మ్యాచ్‌లో భీభత్సం
కొత్త PNG కనెక్షన్‌.. కావాల్సిన డాక్యూమెంట్స్‌ ఇవే!
కొత్త PNG కనెక్షన్‌.. కావాల్సిన డాక్యూమెంట్స్‌ ఇవే!