Coolie box office collection Day 1: బాక్సాఫీస్ పై రజినీ దండయాత్ర.. మొదటి రోజే కూలీ వసూళ్ల సునామీ.. ఎంతంటే..
అడియన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన సినిమా కూలీ. జైలర్ సూపర్ హిట్టు తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 14న విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కూలీ. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీ నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందే కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించడంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో నిర్మించి ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకు మొదటి రోజే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
ట్రేడ్ నివేదికల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజే రూ.170 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో తొలి రోజే రూ.65 కోట్లు కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడు చిత్రాలలో రెండింటిని కూలీ అధిగమించింది. మొదటి సినిమా ఖైదీ తొలి రోజున రూ.6.4 కోట్లు వసూలు చేయగా.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఫస్ట్ డే రూ.37.5 తో కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు రజినీ నటించిన కూలీ చిత్రం మొదటి రోజే రూ.65 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. గతంలో లోకేష్ దర్శకత్వంలో విజయ్, త్రిష నటించిన లియో సినిమా మొదటి రోజే రూ.76.2 కోట్లు వసూలు చేసి.. మొత్తానికి రూ.341 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
రజినీ కెరీర్ లో అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా కూలీ నిలిచింది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో కూలీ సినిమా దూసుకుపోతుంది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక విడుదలకు ముందే విడుదలైన పూజా హోగ్డే మోనికా సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపింది.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..







