Vishwak Sen: దినేశ్ నాయుడు నుంచి విశ్వక్ సేన్‌గా మారిన హీరో.. ఎందుకు పేరు మార్చుకున్నారంటే..
యూత్ ఫుల్, లవ్, కమర్షియలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో అసలు పేరు విశ్వక్ సేన్ కాదట. తన పేరు దినేశ్ నాయుడు అని.. కానీ విశ్వక్ సేన్ గా పేరు మార్చుకున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్.. తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తాను నటించిన ఓ సినిమా దాదాపు రెండేళ్లు వాయిదా పడిందని.. అందుకే పేరు మార్చుకున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. యూత్ ఫుల్, లవ్, కమర్షియలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో అసలు పేరు విశ్వక్ సేన్ కాదట. తన పేరు దినేశ్ నాయుడు అని.. కానీ విశ్వక్ సేన్ గా పేరు మార్చుకున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్.. తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తాను నటించిన ఓ సినిమా దాదాపు రెండేళ్లు వాయిదా పడిందని.. అందుకే పేరు మార్చుకున్నట్లు చెప్పారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “అనుకోని ఆలస్యం తర్వాత సినిమా విడుదలైతే వచ్చే సంతోషం ఎలా ఉంటుందో నాక్కూడా తెలుసు. వెళ్లిపోమాకే నా మొదటి సినిమా. దాదాపు రూ.12 లక్షలు ఖర్చు పెట్టి తెరకెక్కించాం. ఇదిగో రిలీజ్.. అదిగో రిలీజ్ అంటూ సుమారు 24 నెలలు వాయిదా పడింది. అప్పుడు ఇంట్లో వాళ్లు న్యూమరాలజిస్ట్ కు నా జాతకం చూపిస్తే దినేశ్ నాయుడు అనే పేరుతో ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో గుర్తింపు రాదని.. వెంటనే పేరు మార్చుకోవాలని చెప్పారు. అతనే నాలుగు పేర్లు చెప్పగా.. అందులో విశ్వక్ సేన్ అని నేను సెలక్ట్ చేసుకున్నాను.ఈ బెంగాళీ పేరు నీకెందుకు ? అని ఇంట్లోవాళ్లు అన్నా.. సినిమా రిలీజ్ కావడం ముఖ్యమనుకున్నాను..




దినేశ్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ గా మారిన నెల రోజుల్లోనే సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మూడు రోజులకే రామానాయుడు స్టూడియోస్ లో తరుణ్ భాస్కర్ కు ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓపిక చాలా అవసరం. అందుకే ఇప్పటివరుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నెవర్ గివప్ అనే ఆలోచనలోనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు విశ్వక్ సేన్.




