Saamanyudu Trailer Talk: సామాన్యుడు ట్రైలర్ టాక్.. మరోసారి అదరగొట్టిన విశాల్..

Saamanyudu Trailer Talk: సామాన్యుడు ట్రైలర్ టాక్.. మరోసారి అదరగొట్టిన విశాల్..
Vishal

తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విశాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాయి.

Rajitha Chanti

|

Jan 20, 2022 | 7:31 AM

తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విశాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించాయి. తన నటనతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు విశాల్. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సామాన్యుడు.. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఇప్ప‌టికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రావ‌డంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

టైటిల్‌కు తగ్గట్టు సినిమాలో విశాల్ కామన్ మ్యాన్‌గా కనిపించబోతోన్నారు. ఒక‌ క్రైమ్ కథను వివరిస్తూ విశాల్ పాత్ర ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంది. ‘ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒకదానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్‌కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను’ అనే డైలాగ్ సినిమా నేపథ్యం ఏంటో చెబుతోంది.

ట్రైలర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇందులో విశాల్ సరసన డింపుల్ హయతి నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ, కెమిస్ట్రీ యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. ఇందులో అద్బుతమైన డైలాగ్స్‌, పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫామెన్స్‌తో విశాల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికంగానూ ట్రైల‌ర్ ఉన్న‌తంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‏కు యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో కూడా ఈ ట్రైలర్‏కు ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu