Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమాతో వెండితెరకు పరిచయమైంది కృతిసనన్. ఆతర్వాత నాగచైతన్యతో కలిసి 'దోచేయ్' సినిమాలో సందడి చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమాతో వెండితెరకు పరిచయమైంది కృతిసనన్. ఆతర్వాత నాగచైతన్యతో కలిసి ‘దోచేయ్’ సినిమాలో సందడి చేసింది. సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘మిమి’ సినిమాతో మెప్పించిన ఈ అందాల తార అందులోని ‘పరం సుందరి’ పాటతో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా నటిస్తోంది కృతి. దీంతో పాటు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది. తన శరీర సౌష్టవం గురించి ఎదురైన కామెంట్లను పంచుకుంది.
పెదాల ఆకృతి మార్చుకోమన్నారు!
సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మను చూసి ‘నువ్వు నవ్వితే అసలు బావుండవు’ అని విమర్శించారట. అంతే కాదు, ఆమె పెదాల ఆకృతి మార్చుకోమని సలహా ఇచ్చారట. మరికొందరైతే ఆమె ముక్కు బాగోలేదని, ప్టాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారట. ఆమె నవ్వినప్పుడు నాసికా రంధ్రాలు ఎర్రబడతాయని అవహేళన చేశారట ! ఇక సన్నగా సన్నజాజి తీగలా ఉండే ఈ అందాల తార నడుముని ఇంకాస్త తగ్గించుకోమని సూచించారట. అయితే ‘ నేనేం ప్లాస్టిక్ బొమ్మని కాదు కదా’ అంటూ వారి మాటలను అసలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ‘నాకు నాలా మాత్రమే ఉండడం ఇష్టం. మిగతా వారికి కూడా ఇదే సలహా ఇస్తాను. ఎవరెవరో వచ్చి ఏదేదో చెబితే అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండాలి’ అంటూ తనలా బాడీ షేమింగ్ కు గురైన వారిలో స్ఫూర్తినింపింది కృతి. ప్రస్తుతం ‘ఆది పురుష్’ తో పాటు ‘బచ్చన్ పాండే’, షెహజాద’, ‘బేడియా’, ‘గణ్ పత్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల తార. Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..
IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి
Immune-Boosting Foods: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తప్పక తీసుకోవాలి.. అవేంటంటే?