AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: ఆ ఆడపిల్ల అర్థం కావడం లేదంటున్న విశ్వక్ సేన్.. ఎవరంటే..

ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు

Vishwak Sen: ఆ ఆడపిల్ల అర్థం కావడం లేదంటున్న విశ్వక్ సేన్.. ఎవరంటే..
Vishwak
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2022 | 7:15 AM

Share

ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్నలేటేస్ట్ చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తుండగా.. విశ్వక్ సరసన రుక్సార్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీ పై అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా విడుదలైన ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మాట రాని మాయ‌వా.. మాయ జేయు మాట‌వా.. మాటులోని మ‌ల్లెవా.. మ‌ల్లె మాటు ముల్లువా.. వ‌య్యారివా.. క‌య్యారివా.. సింగారివా..సింగాణివా.. రాయంచ‌వా.. రాకాసివా.. లే మంచులో లావా నీవా.. ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా.. నా జీవితంతో ఆటాడుతావా.. అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇది వ‌ర‌కు హీరో విశ్వ‌క్ సేన్ పాత్ర అర్జున్ అని, త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. అలాగే రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌ల చేసిన బ్రీజి మెలోడియ‌స్ సాంగ్ ‘ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా..’ ఆకట్టుకుంటోంది.

జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. రామ్ మిర్యాల పాడారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ అందిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే