AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్,  అతని భార్య, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తమ 18ఏళ్ల వైవాహిక

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి  ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..
Basha Shek
|

Updated on: Jan 20, 2022 | 5:51 AM

Share

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్,  అతని భార్య, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తమ 18ఏళ్ల వైవాహిక బంధానికి  వీడ్కోలు పలుకుతున్నామంటూ  సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ వేర్వేరుగా ప్రకటనలను విడుదల చేశారు. కాగా 2004లో పెద్దల అనుమతితో ఏడడుగులు నడిచిన ధనుష్, ఐశ్వర్యలకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులున్నారు. ఈక్రమంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ లవ్లీ కపుల్ హఠాత్తుగా బ్రేకప్ చెప్పేసి  అభిమానులతో పాటు సినీ ప్రియులకు షాక్ ఇచ్చారు. ఈక్రమంలో ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ పై ధనుష్ తండ్రి, నిర్మాత కస్తూరి రాజా స్పందించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారితో మాట్లాడుతున్నాం..

‘ఆలుమగల మధ్య అపార్థాలు,  గొడవలు చోటుచేసుకోవడం సాధారణం. అటువంటి గొడవలే ధనుష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు.  ఈ విషయమై  ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు అందించాను.  ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని  పునః పరిశీలించాలని వారిద్దరిని కోరారు. మేమే కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వారిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు. ఇద్దరు  పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  సూచిస్తున్నారు’ అని కస్తూరి రాజా తెలిపారు. కాగా ధనుష్, ఐశ్వర్యల విడాకుల వ్యవహారంపై రజనీకాంత్ కుటుంబం నుంచి ఇంకా ఎవరూ స్పందించలేదు.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి

Mrs Andhra Pradesh: 4 పదుల వయసులో మిసెసె ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక.. సత్తా చాటిన ఉత్తరాంధ్ర మహిళ!