Nikki Galrani: కోలీవుడ్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. దుస్తులు, ఖరీదైన కెమెరా అపహరణ.. దొంగ ఎవరంటే..

నిక్కీ గల్రానీ... తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన సంజన గల్రానీ

Nikki Galrani: కోలీవుడ్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. దుస్తులు, ఖరీదైన కెమెరా అపహరణ.. దొంగ ఎవరంటే..
Nikki Galrani
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2022 | 5:50 AM

నిక్కీ గల్రానీ… తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన సంజన గల్రానీ చెల్లెలే ఈ ముద్దుగుమ్మ.  ‘కృష్ణాష్ణమి’, ‘మలుపు’ వంటి తెలుగు చిత్రాలతో నేరుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ  అందాలతార పలు డబ్బింగ్ సినిమాలతో కూడా మెప్పించింది.  కాగా ఇటీవల నిక్కీకి చెందిన దుస్తులు, ఖరీదైన కెమెరాలు చోరీకి గురయ్యాయి. ఈ వస్తువుల విలువ సుమారు రూ.  లక్షకుపైగా ఉంటాయని అంచనా.  కాగా చోరీ జరిగిన రోజు నుంచి  చెన్నై రాయపేటలోని  ఆమె ఇంట్లో పని చేసే ధనుష్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు.  దీంతో అతనే ఈ చోరికి పాల్పడి ఉంటాడని భావించిన నిక్కీ ధనుష్ పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. కాగా ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు ధనుష్ కోసం గాలింపు చేపట్టారు.

కాగా మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని ధనుష్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిక్కీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ధనుషే ఈ చోరికి పాల్పడ్డాడనిన నిర్ధారణ అయింది. ఈ క్రమంలో  తిరువూర్ లో స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను దొంగలించిన వస్తువులను  స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం చెన్నై పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. దొంగలించిన దుస్తులు, కెమెరాను నిక్కీ గల్రానీకి అప్పగించారు. అయితే ఇది జరిగిన తర్వాత ధనుష్ పై తన ఫిర్యాదును ఉపసంహరించుకుందీ ముద్దుగుమ్మ. ధనుష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరింది. తన వస్తువులు తన దగ్గరకు వచ్చాయన్న సంతృప్తి చాలని, ధనుష్ పై ఎలాంటి కోపం లేదని ఆమె పేర్కొంది.