The Ghost: నాగ్ సినిమా నుంచి కాజల్ ఔట్.. హీరోయిన్‌గా ఆ బాలీవుడ్ బ్యూటీ?
Akkineni Nagarjuna The Ghost Movie: అక్కినేని నాగార్జున లేటెస్ట్ చిత్రం సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ సినిమాతో అక్కినేని నాగర్జున ఘన విజయం అందుకున్నారు. బంగార్రాజు అందించిన ఉత్సాహంతో తన నెక్ట్ సినిమా..
The Ghost: సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’(Bangarraju) సినిమాతో అక్కినేని నాగర్జున(Nagarjuna Akkineni) ఘన విజయం అందుకున్నారు. బంగార్రాజు అందించిన ఉత్సాహంతో తన నెక్ట్ సినిమా ‘ది ఘోస్ట్’ను పట్టాలెక్కించేందుకు నాగర్జున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా.. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే ఆసక్తిని పెంచేలా చేసింది. అందుకు తగ్గట్టుగానే కథలో వైవిధ్యం ఉండేలా ఎంచుకున్నారంట. ‘ది ఘోస్ట్'(The Ghost) సినిమా కూడా ‘గరుడవేగ’ తరహాలోనే ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో నాగర్జున ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన జోడీగా నటించే విషయంతో తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా చందమామ ఫేమ్ ‘కాజల్ అగర్వాల్’ ను అనుకున్నారని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం కాజల్ ఏవో కారణాలతో ఈ సినిమా నుంచి సైడ్ అయిందంట. ప్రస్తుం కాజల్ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ ‘సోనాల్ చౌహాన్’ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో హీరోయిన్ సీన్స్‌ను ఇంతవరకు షూట్ చేయలేదంటా. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ ఎంపికతో షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందంట.
ఇప్పటికే కొన్ని తెలుగు చిత్రాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ బామ.. బాగానే అలరించింది. ముఖ్యంగా ‘డిక్టేటర్’, ‘లెజెండ్’, ‘రూలర్’, ‘పండగచేస్కో’ వంటి తెలుగు సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా లీడ్ రోల్ పోషిస్తోంది. నాగ్ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న ఈ భామ.. ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Mirnalini Ravi: తనదైన స్మైల్ , స్టైల్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్..