AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ఆ విషయంలో కొడాలి నానికి హ్యాట్సాఫ్.. మోడ్రన్ గుడివాడకు కృషి చేస్తుంటే విమర్శిస్తారా అంటూ ఆర్జీవీ సెటైర్లు

ఏపీ మంత్రి కొడాలి నానికి డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మధ్య గత కొద్దిరోజులుగా వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు మరోసారి ఆర్‌జీవీ తనదైన స్టైల్‌లో నెట్టింట్లో విమర్శలు గుప్పించారు.

RGV: ఆ విషయంలో కొడాలి నానికి హ్యాట్సాఫ్.. మోడ్రన్ గుడివాడకు కృషి చేస్తుంటే విమర్శిస్తారా అంటూ ఆర్జీవీ సెటైర్లు
Rgv Vs Nani
Venkata Chari
|

Updated on: Jan 19, 2022 | 4:24 PM

Share

Ram Gopal Varma vs Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానికి డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మధ్య గత కొద్దిరోజులుగా వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు మరోసారి ఆర్‌జీవీ తనదైన స్టైల్‌లో నెట్టింట్లో విమర్శలు గుప్పించారు. గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకులు కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జూదం ఏర్పాటు చేశారనే విషయం ఏపీలో సంచలనం కలిగించింది. అయితే ఇదే విషయమై ఆర్‌జీవీ నెట్టింట్లో వరుసగా ట్వీట్లు చేశారు. గుడివాడ డెవలప్‌మెంట్‌కు కొడాలిన నాని ఎంతగానో పాటుపడుతున్నాడని, ఆయనకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నానంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా క్యాసినోపై వస్తోన్న విమర్శలను విస్మరించాలంటూ ట్వీట్లు చేసి మరోసారి హీట్ పెంచారు.

వరుసగా ట్వీట్లు చూస్తూ కొడాలి నానిపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. “గుడివాడ అభివృద్ధికి పాటుపడుతోన్న మంత్రి కొడాలి నానికి నా ధన్యవాదాలు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. క్యాసినోపై వస్తోన్న విమర్శలను అస్సలు పట్టించుకోవద్దు. అలాంటి వ్యతిరేక విమర్శలు చేస్తున్న వారిని విస్మరించండి” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

“గుడివాడను లండన్, లాస్‌వెగాస్‌, పారిస్‌ లాంటి దేశాల లిస్టులో ఉంచేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనను తప్పకుండా మెచ్చుకోవాలి” అంటూ మరో ట్వీట్ చేశారు.

“గోవాలో ఉన్న క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చిన నానిని ఎందుకు విమర్శిస్తున్నారు. వారంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. గుడివాడలోని జనం గోవా సిటీకి వెళ్తారు. కానీ, గోవా ప్రజలు మాత్రం గుడివాడకు రాలేరు. జై గుడివాడ’’ అంటూ తనదైన స్టైల్‌లో రాంగోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు.

Also Read:  Khiladi Movie Fourth Single: రవితేజ “ఖిలాడి” నుంచి ఫోర్త్ సింగిల్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Raima Islam Shimu: గోనే సంచిలో నటి మృతదేహం.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..