Khiladi Movie Fourth Single: రవితేజ “ఖిలాడి” నుంచి ఫోర్త్ సింగిల్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో ఫుల్ ఫాంలో దూసకపోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్నాయి. 'క్రాక్' సినిమాతో ఫాంలోకి వచ్చిన రవితేజ..

Khiladi Movie Fourth Single: రవితేజ “ఖిలాడి” నుంచి ఫోర్త్ సింగిల్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
Raviteja Khiladi Movie
Follow us
Venkata Chari

|

Updated on: Jan 19, 2022 | 3:31 PM

Khiladi Movie Fourth Single: మాస్ మహారాజా రవితేజ(Raviteja) ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో ఫుల్ ఫాంలో దూసకపోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్నాయి. ‘క్రాక్’ సినిమాతో ఫాంలోకి వచ్చిన రవితేజ.. తన నెక్ట్స్ మూవీస్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా ‘ఖిలాడి'(Khiladi) సినిమా విడుదలకు సిద్ధమైంది. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఖిలాడిని నిర్మిస్తున్నారు. డింపుల్ హాయాతి, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ముఖేశ్ రుషి, సచిన్ కేద్కర్, రావు రమేశ్, మురళీశర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో అనసూయ ప్రత్యేకమైన పాత్రలో మెరవనుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పాటలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫుల్‌ కిక్ అంటూ సాగే ఈ పాటను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అలాగే ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

Also Read: Raima Islam Shimu: గోనే సంచిలో నటి మృతదేహం.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

చక్కనైన నవ్వుతో ఫోటోకు స్మైల్ ఇస్తోన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..