AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilraju: సుకుమార్ రైటింగ్ బ్యానర్‏లో ఆశిష్ సెల్ఫిష్ మూవీ.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు ఆశిష్. ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రౌడీ బాయ్స్.

Dilraju: సుకుమార్ రైటింగ్ బ్యానర్‏లో ఆశిష్ సెల్ఫిష్ మూవీ.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..
Dilraju
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2022 | 7:50 AM

Share

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు ఆశిష్. ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో ఆశిష్ సరసన టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడచంతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. కథ, కథనాలు బాగున్నాయని, ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో ఓపెనింగ్స్ నిలకడగా ఉన్నాయి. పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదు. ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. మౌత్‌టాక్‌తో వసూళ్లు నిలకడగా వున్నాయి. సంక్రాంతి బరిలో విడుదలై అందరి అభినందనలు అందుకుంటుంది. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడుతుంది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. రెండో వారంలో ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది. ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు. అతడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను ఎంచుకున్నాం. భవిష్యత్తులో అతడు మంచి కథలు ఎంచుకునేలా చూసే బాధ్యత నాపై ఉంది.

దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తుంది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఈ నిబంధనను మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. కరోనా భయాలు పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో గురువారం నుంచి వసూళ్లు పెరుగుతాయనే నమ్మకముంది. ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి సెల్ఫిష్ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సుకుమార్ సంభాషణలను అందించనున్నారు. ఆర్య తర్వాత నేను, సుకుమార్‌తో కలిసి చేస్తున్న చిత్రమిది. అందువల్లే బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు దిల్ రాజు.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..

ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!