PM Narendra Modi:ప్రధాని మోడీ మెచ్చిన ఆ సినిమాకు పన్ను మినహాయింపు.. ఇంతకీ ఏముందీ మూవీలో!

The Sabarmati Report: 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు మరో రాష్ట్రంలో కూడా ఈ మూవీకి పన్ను మినహాయింపు ఇచ్చారు.

PM Narendra Modi:ప్రధాని మోడీ మెచ్చిన ఆ సినిమాకు పన్ను మినహాయింపు.. ఇంతకీ ఏముందీ మూవీలో!
The Sabarmati Report
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 4:40 PM

2002లో గుజరాత్ తో చోటు చేసుకున్న గోద్రా సంఘటన ఆధారంగా ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రిత మే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. గోద్రా ఘటన తర్వాత మీడియా ఎలా వ్యవహరించింది? అసలు ఏం జరిగింది? దాన్ని కప్పిపుచ్చడానికి ఎలా ప్రయత్నించారు? అనే ఆసక్తికర అంశాలను ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాలో చూపించారు మేకర్స్. విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందనలు తెలిపారు. ‘ఇలాంటి నిజం బయటకు రావాలి’ అని ట్వీట్ కూడా చేశారు. నరేంద్ర మోదీ ప్రశంసల నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు. మధ్యప్రదేశ్ తర్వాత మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోనూ ఇప్పుడు ఈ మూవీకి పన్ను మినహాయింపు ప్రకటించారు. హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీ ఇటీవల ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని తన కేబినెట్ మంత్రులతో పాటు కొందరు కేంద్ర మంత్రులతో కలిసి వీక్షించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా పాల్గొన్నారు. సినిమా వీక్షించిన అనంతరం సీఎం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని కొనియాడారు. ఆ తర్వాత హర్యానాలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు.

‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాను ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’తో పోల్చిన సీఎం సైనీ.. ‘అప్పుడు జరిగిన సంఘటనలను సత్యానికి దగ్గరగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది’ అని పేర్కొన్నారు. ఇక ఇదే సినిమాపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేస్తూ.. ‘నిజం బయటకు రావడం చాలా బాగుంది. అందులోనూ సామాన్యులు చూసి అర్థం చేసుకోగలిగే నిజం మీడియా ద్వారా బయటకు వస్తోంది. తప్పుడు ప్రకటనలు, కథనాలు కొంత కాలం మాత్రమే మనుగడలో ఉంటాయని, ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటకు రావాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. .

ఇవి కూడా చదవండి

గతంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’, ‘వ్యాక్సిన్ వార్’, మరికొన్ని సినిమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు కూడా పన్ను మినహాయింపు ఇస్తున్నారు. ఈ చిత్రానికి ధీరజ్ సర్నా దర్శకత్వం వహిస్తున్నారు.క్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది.

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.