Tamannaah : తమన్నాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను.. ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన విజయ్ వర్మ..

మరోవైపు నిజాంగానే వీరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే గతంలో విజయ్ వర్మతో డేటింగ్ గురించి పరోక్షంగా స్పందించింది తమన్నా. తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు విజయ్ వర్మ. తమన్నాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే GQకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ షిప్ గురించి స్పందించారు విజయ్.

Tamannaah : తమన్నాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను.. ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన విజయ్ వర్మ..
Vijay Varma, Tamannaah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2023 | 8:22 PM

టాలీవుజ్ క్రేజీ హీరోయిన్ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 చిత్రంలో నటించారు. అయితే కేవలం ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే రిలేషన్ లో ఉన్నామని ప్రచారం చేస్తున్నారని టాక్ నడిచింది. మరోవైపు నిజాంగానే వీరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే గతంలో విజయ్ వర్మతో డేటింగ్ గురించి పరోక్షంగా స్పందించింది తమన్నా. తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు విజయ్ వర్మ. తమన్నాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే GQకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ షిప్ గురించి స్పందించారు విజయ్.

“మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నామని ఇప్పుడు బాగా అర్థమైంది. నేను ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఆమెతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను. ఆమె రాకతో నా జీవితంలో విలన్ దశ ముగిసిపోయింది. ఇప్పుడు రొమాంటిక్ దశ మొదలైంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తమన్నా, విజయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే సంతోషంగా ఉంటామనే భావన కలగాలని.. విజయ్ వర్మతో తనకు అలాంటి భావన ఉంటుందని చెప్పుకొచ్చింది. తన జీవితంలో విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతను తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం ఉందని తెలిపింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.