AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasthuri Shankar: అమ్మాయిల పర్సనల్‌ వీడియో షేర్‌ చేసిన నటి కస్తూరి.. సింగర్‌ చిన్మయి, నెటిజన్ల ఆగ్రహం

ఇటీవల ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా, ఇటీవల గిరిజన యువకుడిపై మూత్రం పోయడం వంటి సంఘటనలపై కస్తూరి చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో అమ్మాయిల వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది కస్తూరి.

Kasthuri Shankar: అమ్మాయిల పర్సనల్‌ వీడియో షేర్‌ చేసిన నటి కస్తూరి.. సింగర్‌ చిన్మయి, నెటిజన్ల ఆగ్రహం
Chinmayi, Kasturi
Basha Shek
|

Updated on: Jul 14, 2023 | 8:27 PM

Share

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది కస్తూరి శంకర్‌. నాగార్జున అన్నమయ్య, బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం,రాజశేఖర్ మా ఆయన బంగారం, రథయాత్ర తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఇప్పుడు పలు టీవీ సీరియల్స్‌, షోల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలు, సీరియల్స్‌ సంగతి పక్కన పెడితే ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ఇటీవల ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా, ఇటీవల గిరిజన యువకుడిపై మూత్రం పోయడం వంటి సంఘటనలపై కస్తూరి చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో అమ్మాయిల వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది కస్తూరి. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నెటిజన్లు కస్తూరిని ట్రోల్‌ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రముఖ సింగర్‌ చిన్మయి కూడా కస్తూరి పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ కస్తూరి ఏం షేర్‌ చేసిందో తెలుసా?

ఇద్దరు అమ్మాయిలు ఓ మద్యం షాపులో ఆల్కహాల్ కొంటున్న వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది కస్తూరి. ‘ తాగండి అమ్మాయిలు బాగా తాగండి.. 8 మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు.. ఏ మాత్రం తప్పు కాదు. వాట్సాప్‌ ఫార్వర్డ్‌ ఆఫ్‌ ద డే. మీరు సూపర్‌. అమ్మాయిల హక్కులు ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది కస్తూరి. అయితే అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడంపై కస్తూరిపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. అసలు అమ్మాయిలు మందు తాగడాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? లేదా వ్యతిరేకిస్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార. అమ్మాయిలు మందు తాగకూడదని లేదా కొనకూడదని ఎక్కడైనా ఉందా? ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు ఇలాగే చేస్తే నెట్టింట షేర్‌ చేస్తే దమ్ముందా నీకు? అంటూ ఓ రేంజ్‌లో కస్తూరిని ఆడేసుకుంటున్నారు. ఇక ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద కూడా కస్తూరి పోస్ట్‌పై స్పందించింది. ‘నిజాయతీగా చెబుతున్నా.. కస్తూరి నువ్వు ఇలాంటి వీడియో షేర్‌ చేయాల్సిన అవసరం లేదు’ అంటూ కస్తూరిపై మండిపడింది. దీంతో నెటిజన్లు కూడా చిన్మయికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..