AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ విజయ్ దేవరకొండ.. ఈసారి గట్టి పోటీ

ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోల మధ్య గట్టిపోటీ జరగనుంది. ఆ హీరోలు ఎవరో కాదు విశ్వక్ సేన్, విజయ్ దేవర కొండ. విజయ్ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా .. విశ్వక్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలకు దర్శకుడు తరుణ్ భాస్కరే.. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.

Vijay Deverakonda vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ విజయ్ దేవరకొండ.. ఈసారి గట్టి పోటీ
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2023 | 3:50 PM

Share

సినీ  ఇండస్ట్రీలో హీరోల మధ్య హెల్దీ కాంపిటేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓకే సారి ఇద్దరు లేదా ముగ్గురు హీరోల సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. లేదా సంక్రాంతి, సమ్మర్ లాంటి సీజన్స్ లో ఏకంగా ఐదు ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోల మధ్య గట్టిపోటీ జరగనుంది. ఆ హీరోలు ఎవరో కాదు విశ్వక్ సేన్, విజయ్ దేవర కొండ. విజయ్ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా .. విశ్వక్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలకు దర్శకుడు తరుణ్ భాస్కరే.. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు హీరోలు తమ యాటిట్యూడ్స్ తో యూత్ ను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర బరిలో పోటీపడనున్నారని తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది.. కానీ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే విశ్వక్ రఫ్ అండ్ టప్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా పై విశ్వక్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాను 2024 మర్చి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వస్తుంది’. ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు డేట్ ను మార్చేశారు. ఈ సినిమాను మర్చి 8న రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అదే నిజమైతే విజయ్, విశ్వక్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడతారు.  మరి ఈ పోటీలో ఎవరు విన్ అవుతారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.