Mahesh Babu : ‘సింప్లిసిటీకి అన్న కేరాఫ్ అడ్రస్’.. హ్యాంగర్‌కు ఉన్న టీషర్ట్ వేసుకొస్తే చాలు
టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేష్ బాబుకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఇందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికైంది. నిన్న యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మహేష్ బాబు స్టామినా.. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. మహేష్ బాబుకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేష్ బాబుకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఇందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికైంది. నిన్న యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. దాంతో చిత్రయూనిట్ గట్టిగా ప్రేమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యానిమల్ మూవీ ప్రేయర్ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు మహేష్ బాబు చాలా సింపుల్ గా వచ్చారు. ఒక ప్లేయిన్ టీషర్ట్.. జీన్స్ ప్యాంట్ తో మెరిశారు మహేష్ బాబు. అదేంటో కానీ అక్కడ ఈవెంట్ లో అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నా కూడా మహేష్ బాబు పైనే అందరి దృష్టి పడింది. అంతలా అందరిని డామినేట్ చేశాడు సూపర్ స్టార్.
నిన్న జరిగిన ఈవెంట్ కు హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, దిల్ రాజు హాజరయ్యారు. మహేష్ బాబు గెస్ట్ గా రానున్నారని తెలిసి.. వేలాదిగా మల్లారెడ్డి స్టూడెంట్స్ హాజరయ్యారు. దాంతో ఈవెంట్ అంతా జనసంద్రంగా మారిపోయింది. కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే పర్మిషన్ ఉండటంతో .. మాములు అభిమానులు ఈ ఈవెంట్ లో పాల్గొనలేకపోయారు.. లేకుంటే మరోలా ఉండేది. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. తనకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టమని. నేను పెద్ద అభిమానిని అని అన్నారు.
Hello! Dhfms #GunturKaaram pic.twitter.com/5XM3rwX80L
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) November 28, 2023
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ పోస్ట్
Moment of the day Jai babu 🔥 pic.twitter.com/BIbAGrWQrR
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) November 27, 2023
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ పోస్ట్
👌👌👌 pic.twitter.com/4XtTYajJGy
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) November 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




