Salaar: మొదలైన సలార్‌ కౌంట్‌ డౌన్‌.! మార్కెట్లోకి సలార్ టీషర్ట్స్.. ధరెంతో తెలుసా.?

Salaar: మొదలైన సలార్‌ కౌంట్‌ డౌన్‌.! మార్కెట్లోకి సలార్ టీషర్ట్స్.. ధరెంతో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Nov 28, 2023 | 4:22 PM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఓవైపు సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరోవైపు సలార్ సినిమా కోసం త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట హోంబలే ఫిల్మ్స్. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్ కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ సందడి చేస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల కోసం ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ (hombaleverse) వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..499 రూపాయల నుంచి ప్రారంభమై 1499 వరకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ… అదేరోజున విడుదలవుతున్న షారుఖ్ నటించిన డుంకీ సినిమాతో పోటీ పడబోతోంది. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.