క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ‘ప‌చ్చీస్’ మూవీ.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్.. ఇంట్రస్టింగ్ గా ఉందన్న రౌడీ..‌

రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప‌చ్చీస్'‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రానున్న 'ప‌చ్చీస్' మూవీ.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్.. ఇంట్రస్టింగ్ గా ఉందన్న రౌడీ..‌
Pachis Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2021 | 9:11 PM

Pachchis Movie Teaser : రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప‌చ్చీస్’‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శ్వేతా వ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది‌. ఈ క్రమంలో ‘ప‌చ్చీస్’ టైటిల్ టీజ‌ర్‌ను గురువారం సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ విడుదల చేశారు. టీజర్ త‌న‌కు బాగా న‌చ్చింద‌నీ, సినిమా చాలా ఇంట‌రెస్టింగ్‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంద‌నీ విజయ్ అన్నారు.

ద‌ర్శ‌కులు శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి మాట్లాడుతూ.. “క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ప‌చ్చీస్‌ను రూపొందిస్తున్నాం. కొత్త‌ద‌నం కోసం ఎదురుచూసే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేవిధంగా ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. విజువ‌ల్స్‌, మ్యూజిక్‌, సౌండ్ లాంటి అన్ని విష‌యాల్లోనూ ఈ సినిమా బాగా వ‌స్తోంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. నాన్‌స్టాప్ యాక్ష‌న్‌తో, గాంబ్లింగ్‌, పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందని . అలాగే థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ కోస‌మే ఈ సినిమా తీస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా మ్యూజిక్‌, సౌండ్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి.” అని చెప్పారు.‌ హీరో రామ్స్ మాట్లాడుతూ  “ఎంతో క్వాలిటీతో ‘ప‌చ్చీస్’ వ‌స్తున్న తీరుకు నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ విష‌యంలో నా టీమ్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా అన్నారు. టీజ‌ర్ రిలీజ్ చేసినందుకు, త‌న స‌పోర్ట్ అందిస్తున్నందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్పెష‌ల్ థాంక్స్.” అన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘ప‌చ్చీస్’‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sashi Song : ఆది సాయి కుమార్ ‘శశి’ మూవీ నుంచి మరో అందమైన పాట.. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా

Jathi Ratnalu Movie : జాతిరత్నాలు గూస్ పింపుల్స్ సక్సెస్ మీట్.. కడుపుబ్బా నవ్విస్తున్న సినిమా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే