AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sashi Song : ఆది సాయి కుమార్ ‘శశి’ మూవీ నుంచి మరో అందమైన పాట.. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా

ఆదిసాయి కుమార్ .. ప్రేమ కావలి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ హీరో. ఆతర్వాత లవ్లీ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత ఆది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

Sashi Song : ఆది సాయి కుమార్ 'శశి' మూవీ నుంచి మరో అందమైన పాట.. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు సినిమా
Sashi
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2021 | 8:43 PM

Share

Sashi Songs : ఆదిసాయి కుమార్ .. ప్రేమ కావలి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ హీరో. ఆతర్వాత లవ్లీ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత ఆది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలాకాలంగా సరైన హిట్ లేక ఈ కుర్ర హీరో సతమతమయ్యాడు. త్వరలో ఆది శశి సినిమాతో ప్రేక్షకులను పలరించనున్నాడు.  ఇక ఈ సినిమాలో ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్‌ ఎలా మారతాయి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ఈ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో ఆది సాయి కుమార్ లుక్ కొత్తగా ఉంది. ఇదొక రగ్డ్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’.  ‘ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం’అనే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు. నెల 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకం’ పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి ‘ఒకే ఒక లోకం’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియో సాంగ్ తోపాటు ఉంటే ఈపాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా మరోపాట ను రిలీజ్ చేశారు. రానే రాదు అంటూ సాగే మెసేజ్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jathi Ratnalu Movie : జాతిరత్నాలు గూస్ పింపుల్స్ సక్సెస్ మీట్.. కడుపుబ్బా నవ్విస్తున్న సినిమా..

ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్న మహిళా సెలబ్రిటీలు.. చిరిగిన జీన్స్ వేసుకొని స్పందించిన బాలీవుడ్ నటి..