ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్న మహిళా సెలబ్రిటీలు.. చిరిగిన జీన్స్ వేసుకొని స్పందించిన బాలీవుడ్ నటి..

Gul Panag Responds : నేటి యువత మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్‌తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో

ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్న మహిళా సెలబ్రిటీలు.. చిరిగిన జీన్స్ వేసుకొని స్పందించిన బాలీవుడ్ నటి..
Gul Panag Responds
Follow us
uppula Raju

|

Updated on: Mar 18, 2021 | 6:48 PM

Gul Panag Responds: నేటి యువత మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్‌తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో  బాలల హక్కుల పరిరక్షణకు  సంబంధించి ఉత్తరాఖండ్ స్టేట్ కమిషన్  నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక స్వచ్చంద సంస్థను (ఎన్జీఓ) ను నిర్వహిస్తున్న మహిళ చిరిగిన జీన్స్ ధరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మోకాళ్ళను నగ్నంగా చూపడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ఇది మన కల్చర్ కాదని, విదేశాల్లో వారు ఓ వైపు  మన దేశపు యోగా, పూర్తి వస్త్ర ధారణ చేస్తుంటే మరో వైపు మనం నగ్నత్వం వైపు పరుగులు పెడుతున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ప్రశ్నిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక అప్పటి నుంచి ట్విట్టర్‌లో # రిప్డ్ జీన్స్ ట్విట్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కూడా స్పందించారు. చిరిగిన జీన్స్ మరియు పసుపు టీ షర్టులో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు, చిన్న అమ్మాయి కూడా ఆమెతో నిలబడి ఉంది. ఆమె ట్వీట్‌కు # రిప్డ్ జీన్స్ ట్విట్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తన క్యాప్షన్‌గా జోడించింది.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కాంగ్రెస్ నేతలు, సినీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోన్డ్‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్‌ చేసిన నవ్య అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్‌ అవుతానని తెలిపారు. తమ వస్త్రధారణ కంటే..ముందు మీ అభిప్రాయాలు, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. అయితే..తర్వాత..ఆ పోస్టును డిలీట్ చేశారు.

Covid-19 Warning: కరోనా వైరస్ భవిష్యత్ మార్పులపై యుఎన్ఓ సంచలన హెచ్చరిక.. ఫ్యూచర్‌లో కరోనా ఎలా వుంటుందంటే?

Rashmika Mandanna : పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం