AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty-Vijay Devarakonda: మరోసారి నవీన్ పోలిశెట్టి సినిమాలో విజయ్ దేవరకొండ.. అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న రౌడీ హీరో…

Anushka Shetty : టాలీవుడ్ జేజమ్మ అనుష్క "బహుబలి" తర్వాత ఏలాంటి హిట్ అందుకోలేదు. ఇటీవల "నిశ్శబ్దం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయింది

Anushka Shetty-Vijay Devarakonda: మరోసారి నవీన్ పోలిశెట్టి సినిమాలో విజయ్ దేవరకొండ.. అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న రౌడీ హీరో...
Anushka
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2021 | 7:30 PM

Share

Anushka Shetty : టాలీవుడ్ జేజమ్మ అనుష్క “బహుబలి” తర్వాత ఏలాంటి హిట్ అందుకోలేదు. ఇటీవల “నిశ్శబ్దం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత అనుష్క నుంచి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు చాలానే వస్తున్నా..స్వీటీ మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదట. వరుస డిజాస్టర్లు వెంటాడుతున్న సమయంలో స్టోరీ సెలక్షన్ విషయంలో అచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా అనుష్క తనకంటే చిన్నవాడైన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబోకు రారా కృష్ణయ్య మూవీ డైరెక్టర్ మహేష్ దర్శకత్వం వహించనుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లుగా టాక్. Naveen Polishetty

దాదాపు పదేళ్లకు పైగా వ్యత్యాసం ఉన్న ఈ జంట మధ్య కలిగే ప్రేమ ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టితోపాటు.. మరో హీరో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించబోతున్నాడట. ఇప్పటికే నవీన్ పోలిశెట్టి సినిమాలో విజయ్ గెస్ట్ రోల్‏లో కనిపించాడు.. ఇండస్ట్రీలోకి రాకముందు వీరిద్దరు మంచి స్నేహితులు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. Vijay Devarakonda

Also Read: RRR Movie: ట్విట్టర్ వేదికపై ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. నెట్టింట ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ సంచలనం.. అసలు మ్యాటరెంటంటే..

Dehradun Man: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆపద్భాంధవుడు.. 100 మందిని దత్తత తీసుకున్న..

Singer Chinmayi: ‘ఇలాంటి వార్తలతో అలసిపోయాను.. అది మా వ్యక్తిగతం’.. ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ చిన్నయి..

నిర్మాతలకు సిరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై సినిమాలను ఓటీటీలకు అమ్మితే….