Singer Chinmayi: ‘ఇలాంటి వార్తలతో అలసిపోయాను.. అది మా వ్యక్తిగతం’.. ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ చిన్నయి..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‏లలో చిన్మయి శ్రీపాద ఒకరు. ఎన్నో పాటలను తన గాత్రంతో అందించి...ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చిన్మయి.

Singer Chinmayi: 'ఇలాంటి వార్తలతో అలసిపోయాను.. అది మా వ్యక్తిగతం'.. ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ చిన్నయి..
Chinmayi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 5:42 PM

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‏లలో చిన్మయి శ్రీపాద ఒకరు. ఎన్నో పాటలను తన గాత్రంతో అందించి…ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చిన్మయి. కేవలం గాయనిగా మాత్రమే కాకుండా.. సామాజిక అంశాలు.. సమజంలో మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలపై చిన్మయి ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై బహిరంగంగా కామెంట్స్ చేసి.. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని జోరుగా ప్రచారం చేసింది. ఇవే కాకుండా.. తన కెరీర్ కు సంబంధించిన విషయాల గురించి కూడా చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటుంది. తాజాగా చిన్మయి.. తనపై వస్తున్న రూమర్లపై స్పందించారు.

చిన్మయి ప్రముఖ నటుడు రాహుల్ రావింద్రన్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాహుల్ సొదరుడి వివాహానికి వారిద్దరు హజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. అందులో చిన్మయి చీరకట్టులో ఉంది. అయితే అందులో చిన్మయి బేబి బంప్‏తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకేముంది.. చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా చిన్మయి స్పందిస్తూ.. తనపై వస్తున్న రూమర్స్ అవాస్తవం అని కొట్టిపారేశారు. తమ పెళ్లిఫోటోను షేర్ చేస్తూ.. సుదీర్ఘ పోస్ట్ చేశారు.. “ఇది మా పెళ్లిఫోటో. నాకు మడిసార్ చీరను క్యారీ చేయడం రాదు. ఈ చీరను ధరించినప్పుడు నా ఉదరం కాస్తా పెద్దదిగా కనిపిస్తుంది. ఇటీవల మా మరిది వివాహంలో కూడా మడిసార్ కట్టాను. అది చూసి నేను ప్రెగ్నెంట్ అని.. వార్తలు వస్తున్నాయి. కొందరు యూట్యూబ్ లో వీడియోలు కూడా సృష్టించారు. కానీ నేను ప్రెగ్నెంట్ కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్స్ గురించి.. నా వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో నా ప్రెగ్నెన్సీ గురించి.. పిల్లల గురించి చెప్పాలనిపిస్తే చెప్తా.. లేదంటే లేదు. ఇప్పటికైన నాపై రూమర్స్ క్రియేట్ చేయడం ఆపేస్తే మంచిది. వీటివలన నేను పూర్తిగా అలసిపోయాను ” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేశారు చిన్మయి.

ట్వీట్..

Also Read: TRS MLAs Fire on Revanth: మమ్ములను రాళ్లతో కొడితే నిన్ను చెప్పులతో కొడుతారు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

Mehreen Pirzada: హీరోయిన్‌ మెహ్రీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి